Jos Buttelr: ఇండియాలో బట్లర్ అట్టర్ ప్లాఫ్..! కొనసాగుతున్న ఇంగ్లండ్ సారథి పేలవ ఫామ్
Jos Buttelr: భారత్‌లో టీ20లలో వీరవిహారం చేసే బట్లర్ పప్పులు వన్డేలలో మాత్రం ఉడకడం లేదు. 2013 నుంచి భారత్‌లో ఆడుతున్న బట్లర్ ఇప్పటివరకూ వన్డేలలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
Jos Buttelr: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే జోస్ బట్లర్ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తాడు. గత సీజన్లో ఆశించిన మేర రాణించకపోయినా 2021, 2022 సీజన్లలో బట్లర్ దుమ్ముదులిపాడు. 2022లో అయితే నాలుగు శతకాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో ప్రస్తుతం టాప్-3 బ్యాటర్ల జాబితా తీసుకుంటే బట్లర్ కచ్చితంగా అందులో ఉంటాడు. కానీ భారత్‌లో టీ20లలో వీరవిహారం చేసే బట్లర్ పప్పులు వన్డేలలో మాత్రం ఉడకడం లేదు. 2013 నుంచి భారత్‌లో ఆడుతున్న బట్లర్ ఇప్పటివరకూ వన్డేలలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదంటే అతడు ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్‌తో కలుపుకుని బట్లర్.. భారత్‌లో 12 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి చేసింది 178 పరుగులు మాత్రమే. ఈ క్రమంలో బట్లర్ సగటు 14.83గా నమోదు కాగా టీ20లలో 145కు తగ్గని స్ట్రైక్ రేట్ భారత్‌లో వన్డేలలో మాత్రం 100.56గా నమోదైంది. వన్డే ఫార్మాట్లో బట్లర్‌కు భారత్‌లో అత్యధిక స్కోరు 43గా ఉంది.
Jos Buttler has only scored 95 runs in five innings so far at #CWC23 😬 #ENGvSL pic.twitter.com/VAJMG1CJVK
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2023
50 ఓవర్ల ఫార్మాట్లో భాగంగా బట్లర్ భారత్‌లో చేసిన స్కోర్ల వివరాలు.. 14, 31, 10, 11, 2, 0, 15, 43, 20, 9, 15, 8గా ఉన్నాయి. తన సుదీర్ఘ వన్డే కెరీర్లో 173 మ్యాచ్‌లలో 146 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 40.91 సగటుతో 4,910 పరుగులు చేసిన బట్లర్ 11 సెంచరీలు, 25 అర్థ సెంచరీలు చేశాడు. కానీ భారత్‌లో మాత్రం ఇప్పటిదాకా యాభై పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

