Jonathan Batty : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో అదరగొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురుచూస్తోంది. అందుకోసం మహిళా క్రికెటర్లకు కోచ్‌గా విజయవంతమైన ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జొనాథన్ బాటీని హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ ఈ రోజు వెల్లడించింది. అంతేకాదు భారత మాజీ క్రికెటర్ హేమలత కాల, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ లీసా కీగ్ట్లెను ఆసిస్టెంట్ కోచ్‌లుగా నియమించింది. వీళ్ల నియమాకాన్న ధ్రువీకరిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.
మహిళల జట్టుకు కోచింగ్ ఇవ్వడంలో జొనాథన్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో అతను ఓవల్ ఇన్విన్సిబుల్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఆ జట్టు 2021, 2022లో ది ఉమెన్స్ హండ్రెడ్ ఛాంపియన్షిప్ గెలుపొందడంలో అతని పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు మహిళల బిగ్‌బాష్‌లో లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్, సర్రే ఉమెన్స్ జట్లకు కూడా జొనాథన్ కోచ్‌గా సేవలు అందించాడు. మహిళల క్రికెట్లో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ దశను మారుస్తుంది అని జొనాథన్ అన్నాడు.
బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్నమహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం ఫిబ్రవరి 13న జరగనుంది. మొత్తం 409మంది క్రికెటర్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. 90 మంది ప్లేయర్స్ కోసం ఐదు ఫ్రాంఛైజీలు పోటీ పడనున్నాయి. మార్చిలో ముంబై వేదికగా టోర్నీ ఆరంభం కానుంది.
🚨 ANNOUNCEMENT 🚨
Ahead of the #WPLAuction, here’s welcoming our newly set up coaching staff for our WPL Team 😍#YehHaiNayiDilli pic.twitter.com/IT6N8IezZv
— Delhi Capitals (@DelhiCapitals) February 11, 2023