బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో నిరుటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఢిల్లీ దుమ్మురేపింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది.
తొలుత జెస్ జొనాసెన్(3/25), మిన్ను మణి(3/17) ధాటికి ముంబై 20 ఓవర్లలో 123/9 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(22), హేలీ మాథ్యూస్(22) మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఢిల్లీ 14.3 ఓవర్లలో విజయాన్నందుకుంది. కెప్టెన్ మెగ్ ల్యానింగ్(49 బంతుల్లో 60 నాటౌట్, 9ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. షెఫాలీవర్మ(43) ఆకట్టుకుంది. అమన్‌జోత్‌కు ఏకైక వికెట్ దక్కింది. జొనాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.