బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బౌలర్ జాన్ హాస్టింగ్స్ ఒక ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. ఇందులో 12 వైడ్లు కాగా ఒక నోబాల్ కూడా ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాస్టింగ్స్ ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వరుసగా ఐదు వైడ్లు వేసిన అతడు.. రెండు బంతుల తర్వాత మళ్లీ ఒక నోబ్, మరో ఏడు వైడ్లు వేశాడు.