ముల్తాన్: ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్(Joe Root).. కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 5వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న జో రూట్.. ఈ ఘనతను సాధించాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా ప్రస్తుతం మార్నేస్ లబుషేన్ ఉన్నారు. అతను 3904 రన్స్ చేశాడు. ఇక మూడవ స్థానంలో స్టీవ్ స్మిత్ నిలిచాడు. అతను 3484 రన్స్ చేశాడు.
జో రూట్ ఇదే టెస్టులో మరో భారీ రికార్డును నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. జో రూట్ టెస్టుల్లో 12,473 రన్స్ చేసి.. గతంలో అలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును దాటేశాడు. మరో వైపు క్యాలెండర్ ఇయర్స్ లో ఎక్కువ సార్లు వెయ్యి పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ సమీపిస్తున్నాడు.
HISTORY IS MADE! 🙌
We are witnessing sheer greatness.
🐐 Congratulations, Rooty! 👏#EnglandCricket | @root66 pic.twitter.com/rSAXb3LKEo
— England Cricket (@englandcricket) October 9, 2024