పూణె : మూడు వారాలుగా సాగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో జార్ఖండ్, హర్యానా ఫైనల్ చేరాయి. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో సత్తాచాటిన హైదరాబాద్.. సూపర్ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో హర్యానా చేతిలో పరాభవం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హర్యానా నిర్దేశించిన 247 పరుగుల ఛేదనలో హైదరాబాద్.. 122 రన్స్‌కే కుప్పకూలింది. మరో పోరులో జార్ఖండ్.. ఆంధ్రా చేతిలో ఓడినప్పటికీ నెట్ రన్‌రేట్ (+0.221) మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు ఫైనల్ చేరింది.