Tokyo Olympics | కన్నీరు పెట్టుకుంటున్న ఈ యువతిని చూశారా !! నిజానికి అది కన్నీరు కాదు.. ఎన్నో ఏండ్ల కల సాకారమైన వేళ.. తనకు తెలియకుండానే కండ్ల నుంచి కారిన ఆనంద భాష్పాలు అవి !! టోక్యో ఒలింపిక్స్‌లో 10మీటర్ల సింక్రనైజ్డ్ డైవింగ్‌లో తన పార్టనర్ డెలానో ష్నెల్తో కలిసి అమెరికాకు చెందిన జెస్సికా పెరెటో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండో స్థానంలో నిలిచింది. రజత పతకాన్ని అందుకుంది. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన జెస్సికా ఇలా భావోద్వేగానికి లోనైంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో తొలిసారిగా జెస్సికా పాల్గొంది. అయితే సింక్రనైజ్డ్ డైవింగ్‌లో ఏడో స్థానంలో, ఇండివీడ్యుల్ డైవింగ్‌లో పదో స్థానంలో నిలిచింది. ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకుంది.