మెల్బోర్న్: మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భారత యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను బ్రిస్బేన్ హీట్ జట్టు తిరిగి తీసుకుంది. గురువారం జరిగిన వుమెన్ బిగ్‌బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)వేలం పాట జరిగింది. ఇందులో మొత్తం 23 మంది అంతర్జాతీయ క్రికెటర్లను వివిధ ఫ్రాంచైజీలు సొంత చేసుకున్నాయి.
మిడిలార్డర్లో కీలకమైన రోడ్రిగ్స్‌ను బ్రిస్బేన్ టీమ్ అట్టిపెట్టుకుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. రోడ్రిగ్స్‌తో పాటు చినెల్లీ హెన్రీ, నాదైన్ డీ క్లెర్క్‌ను బ్రిస్బేన్ టీమ్ సొంతం చేసుకుంది. 15 మంది భారత మహిళా క్రికెటర్లు ఈ వేలంలో పాల్గొన్నారు.