DC vs GG : ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కిమ్ గార్త్ బౌలింగ్‌లో కీపర్ సుష్మా వర్మకు క్యాచ్ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్ (1) ఔట్ అయింది. దాంతో, ఢిల్లీ 52 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరిజానే కాప్ (14), జెస్ జొనాసెన్ (2) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. అంతకుమందు ఢిల్లీ ఒకే ఓవర్లో కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది.
స్నేహ్ రానా వేసిన ఆరో ఓవర్లో అలిసే క్యాప్సే(21) రనౌట్ అయింది. రెండో బంతికి ఓపెనర్ మేగ్ లానింగ్(18) ఎల్బీగా ఔట్ అయింది. దాంతో 48 రన్స్ వద్ద ఢిల్లీ రెండో వికెట్ పడింది. ,గార్డ్నర్ వేసిన ఐదో ఓవర్లో అలిసే క్యాప్సే రెండు సిక్స్‌లు కొట్టింది. లానింగ్, క్యాప్సే రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. పవర్ ప్లేలో ఢిల్లీ రెండు మూడు నష్టానికి 51రన్స్ చేసింది.