INDW vs AUSW : ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది.. ఎనిమిదిసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ రికార్డు లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది. భారీ ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. ఆఖర్లో రీచా ఘోష్(26), అమన్‌జోత్ కౌర్(11 నాటౌట్) ఒత్తిడిలోనూ గొప్పగా ఆడారు. దాంతో.. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేదించింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన ఆదివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో ఫేవరెట్ భారత జట్టు గొప్ప పోరాటపటిమతో ఫైనల్ చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయంతో సెమీస్ చేరిన టీమిండియా అదిరే ఆటతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. బౌలర్లు ధరాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. కంగారూ టీమ్ 339 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔటయ్యింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(24) దురదృష్టవశాత్తూ వికెట్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక ఆడేది ఎవరు? జట్టును గెలిపించేది ఎవరు? అనుకున్న వేళ.. జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(89)లు క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లకు పరీక్ష పెట్టారు.
#Final, 𝗛𝗘𝗥𝗘 𝗪𝗘 𝗖𝗢𝗠𝗘! 🇮🇳#TeamIndia book their spot in the #CWC25 final on a historic Navi Mumbai night! 🥳👏
Scorecard ▶ https://t.co/ou9H5gN60l#WomenInBlue | #INDvAUS pic.twitter.com/RCo6FlbXSX
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
ఇంకేముంది.. రికార్డు లక్ష్యాన్ని కరిగించి రికార్డు నెలకొల్పింది టీమిండియా. ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా కంగారూలను కంగారెత్తించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. 2017 సెమీఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేసింది. అంతే.. భారత డగౌట్లో సంబురాలు మొదలవ్వగా.. తొమ్మిదో టైటిల్ వేటను రెండడుగుల దూరంలో ముగించింది ఆసీస్.
భారీ ఛేదనలో దంచేస్తారనుకుంటే భారత ఓపెనర్లు పవర్ ప్లేలోనే డగౌట్ చేరారు. రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔట్ కాగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(24) అనూహ్యంగా వెనుదిరిగింది. కిమ్ గార్త్ వేసిన 10వ ఓవర్ రెండో బంతికి తను వికెట్ కీపర్ అలీసా చేతికి చిక్కింది. అంపైర్ ఆ బంతిని వైడ్ ఇవ్వగా రివ్యూ తీసుకుంది ఆసీస్ కెప్టెన్. అయితే.. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్స్ కనిపించగా.. మంధాన నిరాశగా పెవిలియన్ చేరింది. దాంతో రెండో వికెట్ 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పవర్ ప్లేలో రెండు వికెట్లు పడిన వేళ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)లు శతక భాగస్వామ్యం నెలకొల్పారు.
𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗠𝗼𝗱𝗲 🔛
1️⃣2️⃣7️⃣* Runs
1️⃣3️⃣4️⃣ Balls
1️⃣4️⃣ FoursFor her masterclass knock, Jemimah Rodrigues wins the Player of the Match award 🏅
Updates ▶ https://t.co/ou9H5gNDPT#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues pic.twitter.com/1Zvxqwi5rw
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. బౌండరీలు రాబడుతూ స్కోర్ 200 దాటించిన ఈ జోడీ జట్టును గెలుపు దిశగా నడిపింది. సిక్సర్లు బాదిన హర్మన్‌ప్రీత్.. సథర్లాండ్ వేసిన షార్ట్ పిచ్ బంతికి పెద్ద షాట్ ఆడి గార్డ్నర్ చేతికి చిక్కింది. దాంతో..167 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కాసేపు స్వీప్ షాట్లతో అలరించిన దీప్తి శర్మ(24) అనూహ్యంగా రనౌటయ్యింది. ఆ తర్వాత వచ్చిన రీచా ఘోష్(26).. సిక్సర్లతో విరుచుకుపడింది. గార్డ్నర్ ఓవర్లో 83 మీటర్ల సిక్సర్ బాదిన తను.. ఆ తర్వాత బౌండరీతో స్కోర్ 300 దాటించింది. కట్ షౠట్ ఆడబోయి కిమ్ గార్త్ చేతికి చిక్కింది.. అప్పటికీ 24 బంతుల్లో 29 రన్స్ కావాలి. సథర్లాండ్ ఓవర్లో స్వీప్ షాట్‌తో, బ్యాక్‌వర్డ్‌లో బౌండరీ సాధించింది. అంతే.. 12 బంతుల్లో 8 పరుగులకే మారింది సమీకరణం. మొలినెక్స్ ఓవర్లో అమన్‌జోత్ కౌర్ (11 నాటౌట్) రెండు బౌండరీ కొట్టడంతో టీమిండియా 5 వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి ఫైనల్లో అడుగు పెట్టింది.
A captain’s knock of the highest quality! 🫡
Harmanpreet Kaur walks back after a fantastic 8⃣9⃣(88) in the run-chase 👏
Updates ▶️ https://t.co/ou9H5gN60l#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @ImHarmanpreet pic.twitter.com/xfI7o2JEG0
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
వన్డే ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఆస్త్రేలియా సెమీఫైనల్లోనూ దంచేసింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత బౌలర్లకు దడ పుట్టిస్తూ ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119) శతక గర్జన చేయగా.. అలీసా పెర్రీ(77) హాఫ్ సెంచరీతో చెలరేగింది. వీరిద్దరి మెరుపులకు అష్ గార్డ్నర్ (63) విధ్వంసం తోడవ్వగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. శ్రీచరణి(2-43), దీప్తి శర్మ(2-73)లు రాణించడంతో 338కే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.