INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో జరిగిన ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్ సేన తొలి వన్డేలో దంచి కొట్టింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు బాదింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(82), ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్(62 నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగారు. ఓపెనర్ యస్తికా భాటియా(49) కూడా రాణించడంతో ఆసీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌలర్లలో అషే గార్డ్నర్, వరేహమ్ తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ ఓవర్లో ఓపెనర్ హేలీ(0) ఔటయ్యింది. ప్రస్తుతం ఎలిసా పెర్రీ(11), ఫొబే లిచ్‌ఫీల్డ్(3) ఆడుతున్నారు. రెండు ఓవర్లు ఆసీస్ స్కోర్.. 14/1.
Jemimah Rodrigues’ fighting innings and Pooja Vastrakar’s brilliant hits take India to an impressive 282/8 #INDvSA
▶️ https://t.co/a3EHOcBNlQ pic.twitter.com/JCN6ybOhXR
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
టీమిండియా ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. షెఫాలీ వర్మ(1), రీచా ఘోష్(21) స్వల్ప వ్యధిలోనే వెనుదిరిగారు. టెస్టు సిరీస్‌లో విఫలమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(9), స్నేహ్ రాణా(1) విఫలయ్యారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా, యస్తికా భాటియా(49), పూజా వస్త్రాకర్(62 నాటౌట్)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించింది.