మహాముత్తారం, జనవరి 20: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీకే) గ్రామానికి చెందిన ముక్లోత్ మౌనిక రెజ్లింగ్‌లో సత్తాచాటుతున్నది. ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ టోర్నీలో 64కిలోల విభాగంలో మౌనిక పసిడి పతకం తో మెరిసింది. తద్వారా మార్చి నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైంది. మారుమూల అటవీ గ్రామమైన స్తంభంపల్లికి చెందిన ముక్లోత్ కంటిబాయి, లాలూనాయక్ దంపతుల కూతురు అయిన మౌనిక కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో విధ్యనభ్యసించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటూ రైల్వేలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నది.