Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వార్తలకెక్కాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన ఐదో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో బుమ్రాను విడుదల చేశారు. తాజాగా వచ్చే నెలలో మొదలుకానున్న ఆసియా కప్‌లో కూడా ఆడడం సస్పెన్స్‌గా మారింది. పలు మీడియా నివేదికల ప్రకారం టీ20 టోర్నీలో ఆడితే.. రాబోయే సిరీస్‌లో ఆడడం కష్టంగానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో బుమ్రాకు ఆసియా కప్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి మొదలుకానున్నది.
అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరుగనున్నది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచులకు అందుబాటులో ఉన్న బుమ్రాను శుక్రవారం జాతీయ జట్టును రిలీజ్ చేశారు. తాజాగా ఆసియా కప్ ఆడుతాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. బుమ్రా మూడు మ్యాచుల్లో 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు బౌలింగ్ తీశారు. హెడింగ్లీ, లార్డ్స్ టెస్ట్ మ్యాచుల్లో బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. అయితే, మాంచెస్టర్‌లో బుమ్రా తన కెరీర్లో తొలిసారిగా ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. బుమ్రా ఇప్పటి వరకు 48 టెస్ట్‌ల్లో 219 వికెట్లు పడగొట్టాడు. భారత్ లండన్‌కు బయలుదేరే ముందు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఫాస్ట్ బౌలర్ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు మ్యాచులకు అందుబాటులో ఉంటాడని తెలిపాడు.
భారత్ ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆడాల్సి ఉంది. బుమ్రాను టోర్నీకి ఎంపిక చేస్తే ఆసియా కప్ తర్వాత వారంలోపు వెస్టిండిస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశాలు తగ్గుతాయి. ఆసియా కప్ సెప్టెంబర్ 29న ముగుస్తుంది. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో మొదలవుతుంది. ఆ తర్వాత నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంటుంది. వరుస టోర్నీల నేపథ్యంలో ఈ నిర్ణయం కాలా కష్టమైందని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. వాస్తవానికి బుమ్రాకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం.
టీ20 విషయానికొస్తే.. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడే అవకాశాలున్నాయి. దాంతో టీ20 ప్రపంచ కప్‌కు రిహార్సల్ మారుతుంది. బుమ్రా ఆసియా కప్ ఆడి, భారతదేశం ఫైనల్ ఆడితే.. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు ఆడలేడని సంబంధిత వర్గాలు తెలిపాయి. కీలకమైన విషయం ఏంటంటే బుమ్రా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో నెల విరామం తర్వాత ఆసియా కప్ ఆడాలా? లేకపోతే వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో విశ్రాంతి తీసుకోవాలా? దక్షిణాఫ్రికాతో జరిగి రెండు టెస్టులకు ఆడాలా ? అనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించాల్సి ఉంది. ఈ నిర్ణయం సెలక్షన్ కమిటీ చైర్మన్‌తో పాటు హెడ్ కోచ్ నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచక్ నేపథ్యంలో బుమ్రాను ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని పలు నివేదిక తెలిపాయి.