న్యూఢిల్లీ: సమోసా.. భుజియా.. ఈ స్నాక్స్ గురించి తెలియని ఇండియన్స్ ఉండరు. చిన్ననాటి నుంచే ఆ వంటకాలకు ప్రతి ఒక్కరూ అలవాటు పడి ఉంటారు. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కూడా ఆ స్నాక్స్ గురించి మాట్లాడారు. స్పోర్ట్బైబిల్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నతనం నుంచి ఎటువంటి స్నాక్స్ తిన్నాడో చెప్పాడు. భారత్, బ్రిటన్‌కు చెందిన స్నాక్స్‌పై చేసిన వీడియోను ఆ ఛానల్లో పోస్టు చేశారు. ఇండియాలో పాపులరైన సమోసా, భుజియా స్నాక్స్‌ను అమితంగా ఇష్టపడుతానని బుమ్రా చెప్పాడు.
స్నాక్ వార్స్ అన్న సెగ్మెంట్లో ఆ వీడియో సాగింది. బ్రిటన్, ఇండియన్ స్నాక్స్‌ను బుమ్రా ఆ వీడియోలో విశ్లేషించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. బ్రిటన్‌కు చెందిన స్కాంపీ ఫ్రైస్, ఇండియాకు చెందిన భుజియాను అతను పోల్చాడు. స్కాంపీ ఫ్రైస్ తిన్న అతను బాగున్నాయని చెప్పాడు. ఇక ఇండియన్ స్నాక్ భుజియా చిన్నప్పటి నుంచి తింటున్నట్లు చెప్పాడు. సోదరి, తాను చిన్ననాటి నుంచి ఆ స్నాక్స్ ప్రిఫర్ చేసినట్లు చెప్పాడు.
సమోసా.. ఆనియన్ పఫ్ గురించి కూడా బుమ్రా కామెంట్ చేశాడు. కానీ సమోసాను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. వాల్నట్ పచ్చడి.. పకోడీల గురించి కూడా బుమ్రా పోల్చాడు. షిఫ్ అండ్ చిప్స్, చికెన్ బిర్యానీ, ట్విగ్లెట్స్, చక్లి గురించి కూడా బుమ్రా ఆ వీడియలో మాట్లాడాడు.