న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్ శనివారం చెన్నై చేరుకున్నాడు. ఈ ఏడాది టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ తప్పుకోవడంతో అతని స్థానంలో రాయ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. వేలంలో అమ్ముడుపోని రాయ్‌ను కనీస ధర రూ.2కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. ‘జేసన్ రాయ్ వచ్చేశాడు..ఐపీఎల్ 2021 కోసం స్వ్కాడ్ పూర్తయిందని’ అంటూ ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది. బీసీసీఐ ఎస్ఓపీల ప్రకారం ఇంగ్లీష్ ప్లేయర్ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ సీజన్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
.@JasonRoy20 has arrived 🙌
— SunRisers Hyderabad (@SunRisers) April 10, 2021
Squad complete for #IPL2021 ✅#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/DEJNUk8BL0