లాహోర్: పాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్ పదవికి జేసన్ గిలెస్పీ(Jason Gillespie) రాజీనామా చేశారు. ఆ దేశానికి చెందిన మాజీ పేస్ బౌలర్ అకిబ్ జావెద్.. టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గిలెస్పీ స్థానంలో జావెద్ విధులు నిర్వర్తించనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టులకు అకిబ్ జావెద్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో పాకిస్థాన్ తొలి టెస్టు ఆడనున్నది.
వాస్తవానికి గిలెస్పీ కాంట్రాక్టు 2026 వరకు ఉన్నది. కానీ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మధ్య సయోధ్య కుదరడం లేదు. టిమ్ నీల్సన్ కాంట్రాక్టును పొడిగించేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో గిలెస్పీ తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. గిలెస్పీ కంటే ముందు.. టెస్టు కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్టన్ కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డుతో వైరుధ్యాల కారణంగానే క్రిస్టన్ కూడా వైదొలిగాడు.
అకిబ్ జావెద్‌ను సీనియర్ సెలెక్టర్‌గా నియమించడంతో.. పీసీబీతో పనిచేస్తున్న విదేశీ కోచ్‌లు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు.
Former Australian fast bowler Jason Gillespie has called time on his tenure as Pakistan red-ball coach 🏏
More 👇https://t.co/873oq9nyKx
— ICC (@ICC) December 12, 2024