బీజింగ్: టెన్నిస్ యువ సంచలనాలు జన్నిక్ సిన్నర్ (ఇటలీ), కార్లొస్ అల్కారజ్ (స్పెయిన్) చైనా ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో ముఖాముఖి తలపడనున్నారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ అల్కారజ్.. 7-5, 6-3తో డేనియల్ మెద్వెదెవ్ (రష్యా)ను వరుస సెట్లలో ఓడించి ఫైనల్స్ చేరాడు.
మరో సెమీస్‌లో ఒకటో సీడ్ సిన్నర్.. 6-3, 7-3(7/3)తో యుంచవొకెటె బు (చైనా)ను చిత్తుచేశాడు. ఈ ఇద్దరూ గతంలో 9 సార్లు తలపడగా అల్కారజ్ 5 మ్యాచ్‌లు గెలవగా సిన్నర్ నాలుగింటిలో గెలిచాడు.