సిన్సినాటి (యూఎస్) : వింబుల్డన్‌లో అనూహ్య ఓటమి అనంతరం కొన్నిరోజుల పాటు ఆటకు విరామమిచ్చిన స్పెయిన్ నయా బుల్ కార్లొస్ అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌కు ముందు తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
అమెరికా వేదికగా జరుగుతున్న సిన్సినాటి ఓపెన్‌లో రెండో సీడ్ అల్కరాజ్.. 6-1, 2-6, 6-3తో డామిర్ జుముహుర్ (బోస్నియా)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరాడు.