James Anderson : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బౌలింగ్ యూనిట్ అద్భుతమని వర్ణించాడు. తమకు అద్భుతమైన పేసర్లు ఉన్నారని, తమ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదని అండర్సన్ అన్నాడు. ‘మేము నాణ్యమైన, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లను తయారుచేస్తున్నామని అనిపిస్తోంది. మార్క్ వుడ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్ సాధించడం సంతోషంగా ఉంది.
అందుకని మేము ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా గెలవగలం అని’ అండర్స్ తెలిపాడు. అంతేకాదు తమ జట్టులో ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్ ఉన్నాడని అన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో అండర్సన్ సీనియర్ బౌలర్. కివీస్‌తో ఇంగ్లండ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది.
‘నా దృష్టిలో ఓలీ రాబిన్సన్ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడు. ఎందుకంటే..? అతను రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలడు. అతడిని నెట్స్‌లో ఎదుర్కొనేందుకు మా వాళ్లు ఎవరూ ఇష్టపడరు. మా జట్టులోని ప్రతి ఫాస్ట్ బౌలర్ ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించగలరు’ అని ఈ స్పీడ్‌స్టర్ అన్నాడు. స్టువార్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్లతో ఇంగ్లండ్ బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, స్టువార్ట్ బ్రాడ్ రూపంలో ఇంగ్లండ్‌కు ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు. పాకిస్థాన్ పర్యటనలో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు టెస్టుల సిరీస్‌లో పాక్‌ను క్వీన్స్లీప్ చేసింది.
అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్లలో అండర్సన్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ 32 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.