ముంబై: కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్.. తొలిసారి ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఇంతవరకూ ఫ్రాంచైజీ క్రికెట్ (టీ20) ఆడని అండర్సన్.. ఇంగ్లండ్ తరఫున 2014లో చివరిసారి ఆడాడు. 42 ఏండ్ల ఈ దిగ్గజ పేసర్.. రూ. 1.25 కోట్ల కనీస ధరతో తన పేరును నమోదుచేసుకున్నాడు.
రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, చాహల్తో పాటు వెంకటేశ్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ వంటి భారత స్టార్ ఆటగాళ్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నారు. ఈ ఏడాది జూన్లో ముగిసిన టీ20 వరల్డ్ కప్లో మెరిసిన భారత సంతతి అమెరికా పేసర్ నేత్రవల్కర్ సైతం ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నాడు. రూ.30 లక్షల కనీస ధరతో అతడు వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. అంతేగాక ఈసారి ఆక్షన్లో ఇటలీ ఆటగాడు థామస్ డ్రాకా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.