IPL 2025 : ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు బిగ్ బ్రేక్ లభించింది. ఆర్సీబీ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(16)ను జేమీసన్ ఔట్ చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జోరు మీదున్న సాల్ట్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడీ పేసర్. లాంగాఫ్‌లో అతడు గాల్లోకి లేపిన బంతిని గమనిస్తూ వెనక్కి పరుగెత్తిన శ్రేయాస్ అయ్యర్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 18 వద్ద తొలి వికెట్ పడింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(13), మయాంక్ అగర్వాల్(24) మరో వికెట్ పడకుండా.. రన్ రేటు తగ్గకుండా చూసుకుంటూ ఆడుతున్నారు. పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోర్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి సాల్ట్(16) మెరుపు ఆరంభమిచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన అతడు 13 రన్స్ పిండుకున్నాడు. అనంతరం జేమీసన్ ఓవర్లో బౌండరీతో విరుచుకుపడ్డాడు. కానీ, నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచే క్రమంలో అయ్యర్ చేతికి చిక్కాడు.
An eventful start 🔥
A buzzing atmosphere 🤩GAME ON in the Grand Final! 👊
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/xlQF1euGIw
— IndianPremierLeague (@IPL) June 3, 2025
ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన జట్టును విరాట్ కోహ్లీ(13), మయాంక్(24)లు ఆదుకునే పనిలో ఉన్నారు. అర్ష్‌దీప్ వేసిన 3 వ ఓవర్ చివరి బంతికి మయాంక్ సిక్సర్ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 30కి చేరింది. ఆ తర్వాత జేమీసన్‌కు చుక్కలు చూపిస్తూ రెండు ఫోర్లు బాదాడు. అయితే.. పంజాబ్ ఫీల్డర్లు బౌండరీలను అడ్డుకుంటూ స్కోర్ బోర్డు వేగానికి కళ్లెం వేస్తున్నారు.