Jai Shah : అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ జై షా(Jai Shah) శ్రీలంక క్రికెట్ సభ్యులను కలిశారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిసి లంకలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించారు. కొలంబోలో శ్రీలంక ప్రతినిధులను కలిసిన ఈ ద్వయం ఆ దేశ బోర్డు పరిపాలనా వ్యవస్థలో కొనసాగుతున్న మార్పులపై దృష్టి సారించారు.
అవినీతి మరక అంటిన శ్రీలంక క్రికెట్ ఇప్పుడిప్పుడే గాడీన పడుతోంది. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే ఏర్పాటు చేసిన క్రికెట్ బృందం ప్రస్తుతం ఆ దేశంలో ఆటగాళ్ల ఎంపిక పనులు చూసుకుంటోంది. ఈ పరిస్ధితుల్లో శ్రీలంకకు ఆర్ధిక సాయం అందించాలనే ఉద్దేశంతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా.
ఈ నేపథ్యంలో ఐసీసీ చీఫ్ హోదాలో జైషా ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిసి ఆయన శ్రీలంక క్రికెట్ సభ్యులతో సమావేశమయ్యారు. కొలంబోలో తమ క్రికెట్ సభ్యులతో భేటీ అయిన షా, సైకియాలకు లంక ధన్యవాదాలు తెలిపింది.