నాగపూర్: భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాను చుట్టేశారు. నాగపూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజే ఆస్ట్రేలియాను 177 రన్స్‌కు ఆలౌట్ చేశారు. భారత స్పిన్నర్లలో జడేజా అయిదు వికెట్లు తీసుకోగా.. మరో స్పిన్నర్ అశ్విన్ తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. గాయం వల్ల చాలా కాలం ఇండియా జట్టుకు దూరంగా ఉన్న జడేజా .. ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులో చేరాడు. అయితే వచ్చీరాగానే జడేజా తన సత్తా చాటాడు. ఆసీస్ టాప్ బ్యాటర్లను అతను ఖంగుతినిపించాడు. లబుషేన్, స్మిత్, హ్యాండ్స్కోంబ్ వికెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Innings Break!
Brilliant effort from #TeamIndia bowlers as Australia are all out for 177 in the first innings.
An excellent comeback by @imjadeja as he picks up a fifer 👏👏
Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/RPOign3ZEq
— BCCI (@BCCI) February 9, 2023
ఆస్ట్రేలియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్లు వార్నర్, ఖవాజా వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది. షమీ, సిరాజ్‌లు ఆ వికెట్లను తీశారు. ఆ తర్వాత లబుషేన్, స్మిత్‌లు ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. లబుషేన్ 49, స్మిత్ 37 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత ఆసీస్ జట్టులో హ్యాండ్స్కోంబ్ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. హ్యాండ్స్కోంబ్ 31, క్యారీ 36 రన్స్ చేసి ఔటయ్యారు.
That's a 5-wicket haul for @imjadeja 💥🫡🔥
His 11th in Test cricket.
Live – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/Iva1GIljzt
— BCCI (@BCCI) February 9, 2023
తొలి సెషన్లో స్పిన్నర్లు వికెట్లు తీసుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత రెండవ సెషన్లో మాత్రం జడేజా విజృంభించాడు. వరుసగా రెండు బంతుల్లో ఇద్దర్నీ ఔట్ చేశాడు. ఆ తర్వాత కీలకమైన స్మిత్‌ను కూడా ఔట్ చేసి ఆసీస్‌కు జలక్ ఇచ్చాడు. అశ్విన్ తోడవ్వడంతో ఆస్ట్రేలియాకు పరుగులు రాబట్టడం ఇబ్బందిగా మారింది. అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.