IND vs AUS : విశాఖ వన్డేలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. నాథన్ ఎల్లిస్ ( Nathan Ellis) వేసిన 20 ఓవర్ మూడో బంతికి కీపర్ అలెక్స్ క్యారీ డౌవింగ్ క్యాచ్ పట్టడంతో జడ్డూ వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (9), కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న జడ్డూ, అక్షర్ ఏడో వికెట్‌కు 20 రన్స్ జోడించారు. కుదుకున్న విరాట్ కోహ్లీ (31) ని ఎల్లిస్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బకొటాడు. నాలుగు కీలక వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. శుభ్‌మన్ గిల్(0), రోహిత్ శర్మ(13), సూర్యకుమార్ యాదవ్(0), కేఎల్ రాహుల్(9)ను పెవిలియన్ పంపాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. టాపార్డర్‌ను కూల్చాడు. ఒకే ఓవర్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు.