WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజు ఆస్ట్రేలియా ఆలౌట్ ప్రమాదంలో పడింది. రెండో సెషన్లో రవీంద్ర జడేజా తన మొదటి ఓవర్లోనే అలెక్స్ క్యారీ (48)ని ఔట్ చేశాడు. మూడో బంతికి సిక్స్ కొట్టిన అతను తర్వాత రివర్స్ స్వీప్ షాట్ ఆడి ఎల్బీగా వెనుదిరిగాడు.
అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో భారత్ రివ్యూ తీసుకుని వికెట్ సాధించింది. దాంతో, 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నాథన్ లియాన్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్(8) క్రీజులో ఉన్నారు.మిచెల్ స్టార్క్ ఔటయ్యాక క్యారీ, కమిన్స్ జాగ్రత్తగా ఆడి స్కోర్ 450 దాటించారు. 115.2 ఓవర్లకు ఆసీస్ స్కోర్.. 454/8.