Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జోనర్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. వెంకటేష్ ఇందులో ‘చిట్టిబాబు’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, విక్రమ్ మార్క్ మాటలతో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా టీజర్లో హైలైట్ అయ్యాయి. ఆదర్శ కుటుంబం అనే పేరుకు తగ్గట్టుగా ఇంట్లోని పరిస్థితులు, వాటి చుట్టూ జరిగే ఆసక్తికర పరిణామాలను ఈ టీజర్లో చూపించారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ ఎస్. థమన్ (S. Thaman) సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమాను అక్టోబర్ 2, 2026న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.