WTC Final 2023 : భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జాదూ చేశాడు. కీలక సమయంలో వికెట్ తీశాడు. నిన్నటి నుంచి క్రీజులో పాతుకుపోయిన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(25)ను పెవిలియన్ పంపాడు. ఫ్రంట్‌ఫుట్ వచ్చిన గ్రీన్ బంతిని డిఫెన్స్ ఆడాడు. బ్యాట్‌కు తగిలిన తర్వాత బంతి వికెట్లకు తాకింది. దాంతో ఆరో వికెట్ 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిచెల్ స్టార్క్(0), అలెక్స్ క్యారీ(32 క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోర్.. 177/6. ప్రస్తుతం ఆస్ట్రేలియా 350 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మూడో రోజు తొలి సెషన్ మొదలైన కాసేపటికే భారత్‌కు బ్రేక్ దొరికింది. డేంజరస్ మార్నస్ లబూషేన్(41)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. లబూషేన్ ఆడిన బంతిని స్లిప్‌లో పూజారా చక్కగా అందుకున్నాడు. దాంతో, ఆస్ట్రేలియా సగం వికెట్లు కోల్పోయింది.