Jacques Kallis : ప్రపంచ క్రికెట్లోని గొప్ప ఆల్రౌండరల్లో జాక్వెస్ కలిస్(Jacques Kallis) పేరు చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ దక్షిణాఫ్రికా(South Africa) మాజీ ఆటగాడు మళ్లీ తన కళాత్మక షాట్లతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. వయసు పెరిగినా క్రికెట్ మీద ఇష్టం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మాస్టర్స్ 10 లీగ్(US Masters T10 League)లో కలిస్ దంచికొడుతున్నాడు.
క్యాలిఫోర్నియా నైట్స్(California Knights)కు ఆడుతున్న ఈ వెటరన్ ఆల్‌రౌండర్ తాజాగా టెక్సాస్ చార్జర్స్(Texas Chargers)పై 64 పరుగులు సాధించాడు. మరో విషయం ఏంటంటే.. ఈ టోర్నీలో కలిస్ రెండో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వరుసగా 18, 38 నాటౌట్, 29, 56 నాటౌట్, 64 స్కోర్లు నమోదు చేశాడు. ఇప్పటివరకూ కలిస్ 7 మ్యాచుల్లో 162.5 స్ట్రయిక్ రేటుతో 221 పరుగులు బాదాడు.
We’ve traveled back in time to witness @jacqueskallis75 deliver 🔝 batting performance for today’s match 1!
Tune-in to #USMastersT10OnStar
Tomorrow | 6:30 PM onwards | Star Sports 1 & Star Sports 1 Hindi#Cricket pic.twitter.com/JLdxcH3idf— Star Sports (@StarSportsIndia) August 19, 2023
ఈ దిగ్గజ ఆటగాడు దక్షిణాఫ్రికా తరఫన 2014లో శ్రీలంక(Srilanka)పై చివరి టెస్టు ఆడాడు. అదే ఏడాది జూలై 30న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు, 250 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా కలిస్ రికార్డు సృష్టించాడు.