ODI WC 2023 : వన్డే ప్రపంచ కప్(ODI Wolrd Cup) టికెట్ల అమ్మకాలతో దేశమంతా సందడి వాతావరణం నెలకొంది. అక్టోబర్ 5న మొదలయ్యే ఈ మహా సమరం కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 12 ఏళ్ల భారత గడ్డపై జరుగనున్న ప్రపంచ కప్ ఆరంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ(BCCI) ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 4న జరిగే ఓపెనింగ్ సెరమొనీ(World Cup Opening Ceremony)కి ఏ స్టేడియం వేదిక కానందో తెలుసా..? అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం(Naredra Modi Stadium).
లక్ష మంది సామర్థ్యం ఉన్న ఈ గ్రౌండ్లో సంబురాల్ని నిర్వహించాలని అనుకుంటున్నారట. అయితే.. బీసీసీఐ మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. వరల్డ్ కప్ ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు ఈ మైదానంలోనే జరుగనున్న విషయం తెలిసిందే.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం
ప్రపంచ కప్ ఓపెనింగ్ సెరమొనీ కనుల విందుగా ఉండనుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ సింగర్స్ ప్రదర్శనలతో స్టేడియం హోరెత్తనుంది. ఈ వేడకకు ఐసీసీ బృందం, గ్లోబల్ క్రికెట్ గవర్నింగ్ బాడీ సభ్యలు, బీసీసీఐ పెద్దలు హాజరుకానున్నారు. అంతేకాదు ‘కెప్టెన్స్ డే'(Captains Day) పేరుతో నిర్వహించే ఈవెంట్లో 10 జట్ల కెప్టెన్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఐసీసీ సభ్యులు వీళ్లకు ప్రపంచ కప్ పోటీల తీరు తెన్నుల గురించి వివరించనుంది. ఆక్టోబర్ 5న జరిగే ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 14న ఇదే స్టేడియంలో భారత్, పాకిస్థాన్ ఢీ కొననున్నాయి.