The Hunderd League : విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్(Jos Buttler) మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. ది హండ్రెడ్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బట్లర్ సిక్సర్ల మోత మోగించాడు. దాంతో, సథర్న్ బ్రేవ్(Southern Brave) జట్టుపై 46 బంతుల్లో6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 రన్స్ కొట్టాడు. దాంతో, మాంచెస్టర్ ఒరిజినల్స్(Manchester Originals) జట్టు 191 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దాంతో, హండ్రెడ్ లీగ్‌లో రికార్డు ఛేదనతో సంచలనం సృష్టించింది. ఓవల్ ఇన్విన్సిబుల్()తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఇరుజట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సథర్న బ్రేవ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. ఓపెనర్లు ఫిన్ అలెన్(56 నాటౌట్), డెవాన్ కాన్వే(51 నాటౌట్) ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగారు. భారీ లక్ష్య ఛేదనలో ఒరిజినల్స్‌కు బట్లర్ శుభారంభం ఇచ్చాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసిన బట్లర్ హాఫ్ సెంచరీతో జట్టును విజయానికి చేరువ చేశాడు.
This is a special team ! https://t.co/dKJWqanAMK
— Sarah Taylor (@Sarah_Taylor30) August 26, 2023
ఫిల్ సాల్ట్(47) కూడా రాణించడంతో మాంచెస్టర్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ పదహారో సీజన్లో పెద్దగా ఆకట్టుకోని ఈ స్టార్ ఓపెనర్ ఈ టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. 9 మ్యాచుల్లో 149.60 స్ట్రయిక్ రేటుతో 380 పరుగులు సాధించాడు.