ఇస్లామాబాద్: అంతర్జాతీయ వన్డే క్రెకెట్లో పాకిస్థాన్ జట్టు నంబర్ వన్‌గా నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టును రెండో స్థానానికి నెట్టేసి పాకిస్థాన్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌ను కూడా పాకిస్థాన్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్ ఆసియా కప్ ఆడబోతున్నది. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్నది. ఆఫ్ఘనిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది.