Jacob Bethell : అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్న జాకబ్ బెథెల్ (Jacob Bethell) చరిత్ర సృష్టించనున్నాడు. చిన్నవయసులోనే కెప్టెన్సీ అందుకున్న ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకోనున్నాడు. ఐర్లాండ్ పర్యటనకు హ్యారీ బ్రూక్ (Harry Brook)కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు బెథెల్‌ను సారథిగా ఎంపిక చేశారు. దాంతో, ఆ దేశ చరిత్రలోనే చిన్న వయస్కుడైన నాయకుడిగా ఈ కుర్రాడు గుర్తింపు సాధించనున్నాడు. ఈరోజు అంటే.. ఆగస్టు 16 శనివారం నాటికి బెథెల్ వయసు.. 21 ఏళ్ల 329 రోజులు.
గత కొంతకాలంగా ఇంగ్లండ్ క్రికెట్లో భావి స్టార్లుగా ఎదుగుతున్న వాళ్లకు కెరీర్ ఆరంభంలోనే కెప్టెన్సీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వెటరన్ ప్లేయర్లు అలెస్టర్ కుక్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్లు 24 ఏళ్లకే సారథిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. బెథెల్‌కు మాత్రం 21 ఏళ్లకే ఆ హోదా దక్కడంతో అతడు పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా అవతరిస్తాడు. ఆగస్టు 17 నుంచి ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది ఇంగ్లండ్. తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ వహించడం ద్వారా బెథెల్ తమ దేశ క్రీడా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పనున్నాడు. ఆగస్టు 21న జరిగే ఆఖరి మ్యాచ్‌తో పొట్టి సిరీస్ ముగియనుంది.
History maker! 💥
Jacob Bethell is set to become our youngest ever England Men’s captain against Ireland 👏
Congrats, Beth! pic.twitter.com/tcR4b0dB0D
— England Cricket (@englandcricket) August 15, 2025
ఇంగ్లండ్ స్క్వాడ్ : జాకబ్ బెథెల్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, రెహాన్ అహ్మద్, సొన్ని బేకర్, టామ్ బాంటన్, లియాం డాసన్, టామ్ హర్ట్లే, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
జాకబ్ బెథెల్ కంటే ముందు ఇంగ్లండ్‌కు చిన్న వయసులోనే కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్లు వీరే.. మాంటీ పర్కేర్ బౌడెన్ – 23 ఏళ్ల 144 రోజులు వయసులో కెప్టెన్ అయ్యాడు. ఇవొ బ్లిఘ్ – 23 ఏళ్ల 292 రోజుల వయసులో, అలెస్టర్ కుక్ 24 ఏళ్ల 325 రోజుల వయసులో సారథ్యం స్వీకరించారు. ఇయాన్ మోర్గాన్ 24 ఏళ్ల 349 రోజులకు, స్టువార్ట్ బ్రాడ్ 25 ఏళ్ల ఒక రోజున, జోస్ బట్లర్ 25 ఏళ్ల 60 వ రోజున కెప్టెన్ అయ్యారు.
Over the Irish sea! 🌊 🏏
Our squad to take on Ireland in Malahide with Jacob Bethell in charge! 🫡 pic.twitter.com/r8tm1soo9N
— England Cricket (@englandcricket) August 15, 2025