CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్లో ఛేజింగ్ జట్టుకు మరో విజయం. తొలిపోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన పంజాబ్ కింగ్స్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. భారీ స్కోర్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్(50)కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(43), ప్రియాన్ష్ ఆర్య(39)లు దంచేశారు. ఫలితంగా పంజాబ్ వరసగా రెండో విజయం నమోదు చేయగా.. సొంత మైదానంలో గెలిచి బోణీ కొట్టాలనుకున్న సూపర్ కింగ్స్‌కు నిరాశే మిగిలింది.
ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్‌లోనూ కంగుతిన్నది. భారీ స్కోర్ కొట్టినా పంజాబ్ కింగ్ టాపార్డర్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమవ్వడంతో సొంత గడ్డపై చతికిలపడింది సీఎస్కే. 210 పరుగుల భారీ ఛేదనలో ఇంప్యాక్ట్ సబ్ ప్రియాన్ష్ ఆర్య(39) ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 4, 6 బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. వరసగా 4, 6, 4తో మ్యాట్ హెన్రీ(2-54)కి చుక్కలు చూపించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(43)తో కలిసి సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడితో ప్రియాన్ష్ పంజాబ్ స్కోర్ బోర్డును ఉరికించాడు.
Led the show with example 🫡#PBKS Captain Shreyas Iyer goes back for a well made 50(29) 👏👏
Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/kCpWu5LluE
— IndianPremierLeague (@IPL) April 3, 2026
చితక్కొడుతున్న ప్రియాన్స్ను హెన్రీ బౌల్డ్ చేయడంతో 61 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. ఆ తర్వాత కూపర్ కొన్నొల్లి(36)తో సమన్వయం లోపంతో ప్రభ్‌సిమ్రన్ రనౌటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(50)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాలనుకున్న కొన్నొల్లిని అన్షుల్ కంభోజ్ ఫుల్‌టాస్‌తో బోల్తా కొట్టించాడు. నేహల్ వధేరా(10) జతగా దూకుడు పెంచిన అయ్యర్ అర్ధ శతకం తర్వాత ఔటయ్యాడు. అప్పటికీ పంజాబ్ విజయానికి 24 రన్స్ కావాలి.
హెన్రీ ఓవర్లో వధేరా ఔట్ కాగా.. మార్కస్ స్టోయినిస్(9), శశాంక్ సింగ్(14)లు లాంఛనం పూర్తి చేశారు. మరో 8 బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును పంజాబ్ చిత్తు చేసింది. గత ఎనిమిదో మ్యాచుల్లో ఏడో విజయంతో సీఎస్కేపై పంజాబ్ తమ ఆధిపత్యం చాటుకుంది.
సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాళ్లు కుమ్మేశారు. చెపాక్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే(73) అర్ధ శతకంతో కదం తొక్కగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సర్ఫరాజ్ ఖాన్(32) దడ పుట్టించాడు. మాత్రే మెరుపులతో డీలా పడిన ప్రత్యర్థిని డెత్ ఓవర్లలో శివం దూబే(45 నాటౌట్) మరింత కుంగదీసేలా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ ముగ్గురి విధ్వంసంతో రెండొందలు కొట్టని చెన్నై.. భారీ స్కోర్‌తో పంజాబ్‌కు సవాల్ విసిరింది.