హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) లో లీగ్‌లకు వేళ యింది. జూన్ 6వ తేదీ నుంచి లీగ్‌లు మొదలవుతాయని హెచ్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో దుర్గాప్రసాద్, సీఈవో సునీల్ లీగ్ వివరాలను వెల్లడించారు.
గతానికి భిన్నంగా ఏ1, ఏ2, ఏ3కి బదులుగా ఈసారి ఏ, బీ, సీ డివిజన్లుగా లీగ్‌లను విభజించారు. లీగ్‌లో ఆడాలనుకునే వాళ్లు ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.