టోక్యో: ఒలింపిక్స్‌లో తృటిలో బ్రాంజ్ మెడల్ చేజార్చుకుంది ఇండియన్ వుమెన్స్ హాకీ టీమ్. అయితే మెడల్ గెలిచినా గెలవకపోయినా మీరు మా బంగారాలే అని దేశం మొత్తం వాళ్లను అక్కున చేర్చుకుంది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఓడిపోయినా తలెత్తుకునేలానే చేశారు. మీరు ఇండియాలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచారు. అదే పెద్ద విజయం అని కింగ్ ఖాన్ చేసిన ట్వీట్‌కు టీమ్ కోచ్ సోయెర్డ్ మరీన్ రిప్లై ఇచ్చాడు.
బాలీవుడ్లో బెస్ట్ అయిన మీలాంటి వాళ్ల సపోర్ట్ పొందడం సంతోషంగా ఉంది. ఇది చక్ దే ఇండియా 2 టైమ్ అని సోయెర్ట్ ట్వీట్ చేశాడు. నిజానికి తాను కూడా చక్ దే ఇండియా సినిమా చూశానని, అదో గొప్ప మూవీ అని అంతకుముందు సోయెర్డ్ అన్నాడు. మూవీలోని అమ్మాయిలు ఎంతో స్ఫూర్తి నింపారు. కానీ మనది కూడా ఒక మూవీయే అని మా అమ్మాయిలతో చెప్పాను. చక్ దే ఇండియా పార్ట్ 2 తీయాల్సిన సమయం వచ్చింది అని సోయెర్డ్ అన్నాడు.
Thank you @srk for all the love ! It's great to have support from the best in Bollywood. It's time for Chak De part 2, what say? 😊 https://t.co/ikJQv3VjdL
— Sjoerd Marijne (@SjoerdMarijne) August 6, 2021