హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఐటీఎఫ్ పురుషుల వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీకి మంగళవారం తెరలేవనుంది. తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్(టీఎస్టీఏ), జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జేహెచ్ఐసీ) ఆధ్వర్యంలో జరుగనున్న టోర్నీని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించనున్నారు.
రూ.12 లక్షల ప్రైజ్మనీ కల్గిన టోర్నీలో ఇప్పటికే భారత ప్లేయర్లు ఆర్యన్ లక్ష్మణన్, రాఘవ్ జైసింఘాని మెయిన్డ్రాకు అర్హత సాధించారు. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో రాఘవ్ 3-6, 7-6(5), 10-5తో అనికేత్ వెంకటరామన్పై గెలిచి ముందంజ వేశాడు.