Harsha Karthika | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇథియోపియా రాజధాని అడిస్ అబాబ వేదికగా జరిగిన ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో భారత యువ ప్లేయర్ ఓరుగంటి హర్షకార్తీక విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన జూనియర్ సింగిల్స్ ఫైనల్లో హర్ష కార్తీక 6-4, 7-6(7/4)తో బ్రూనా లిటో(బ్రెజిల్)పై అద్భుత విజయం సాధించింది. టోర్నీలో ప్రత్యర్థులకు కనీసం ఒక్క సెట్ కోల్పోని కార్తీక ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో చెలరేగుతూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది.