డోప్ టెస్టు మిస్.. వినేశ్‌కు ఐటీఏ నోటీసులు
నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో తిరిగి మ్యాట్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) షాకిచ్చింది.
న్యూఢిల్లీ: నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో తిరిగి మ్యాట్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) షాకిచ్చింది. గతేడాది చివర్లో అవుట్-ఆఫ్-కాంపిటీషన్ డోపింగ్ పరీక్షకు అందుబాటులో ఉండనందుకు గానూ ఆమెకు నోటీసులు జారీ చేసింది.
గత డిసెంబర్ 18న హర్యానా అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిమిత్తం వినేశ్ చండీగఢ్ వెళ్లింది. కానీ, ఆ సమాచారాన్ని ఆమె సకాలంలో అప్డేట్ చేయకపోవడం వల్ల డోపింగ్ నియంత్రణ అధికారికి అందుబాటులో లేకుండా పోయింది.
దీనిపై ఆమె ఇచ్చిన వివరణను తోసిపుచ్చిన ఐటీఏ వినేశ్ డోప్ టెస్టుకు గైర్హాజరైందని అధికారికంగా నమోదు చేసింది. గత 12 నెలల కాలంలో ఫొగాట్ తొలిసారి తన లొకేషన్ వివరాలు తెలపడంలో (వేర్ అబౌట్స్) విఫలమైంది. ఏడాదిలో ఇలాంటి మూడు వేర్ అబౌట్స్ వైఫల్యాలు నమోదైతేనే దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి గరిష్టంగా రెండేళ్ల వరకు నిషేధం విధిస్తారు. అయితే, ఈ నోటీసు డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని, హెచ్చరిక మాత్రమేనని ఐటీఏ తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

