ఐపీఎల్ తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమైన కేఎల్ రాహుల్.. జింబాబ్వే సిరీస్‌లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దొరకని రాహుల్.. రెండో మ్యాచ్‌లో కూడా టాస్గ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంపై అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్‌ను కాదని తనే ఓపెనింగ్‌కు వచ్చాడు. అయితే చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడుతున్న అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. దీన్ని అభిమానులు ఈజీగా తీసుకోలేదు.
మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం అవుతుండగా.. సాధ్యమైనంత ఎక్కువ క్రికెట్ ఆడాల్సింది పోయి, ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం.. లేక లేక బ్యాటింగ్ అవకాశం వస్తే ఒక్క పరుగుకే అవుటవడంతో రాహుల్‌పై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతుంటే ఇలా జరగడం సహజమే అని టీమిండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. మరి మూడో మ్యాచులోనైనా రాహుల్ టాస్ గెలిస్తే.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంటాడేమో చూడాలి.