బాకు(అజర్బైజాన్): ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీలో భారత పతక జోరు కనబరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 50మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత త్రయం సాక్షి సూర్యవంశీ, కిరణ్దీప్కౌర్, తియాన పసిడి పతకంతో మెరిసింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత షూటర్లు 1573 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా, చైనా (1567), మంగోలియా (1566) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల 50మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో తియాన కాంస్య ఖాతాలో వేసుకుంది. పురుషుల 50మీటర్ల పిస్టల్ విభాగంలో రవిందర్సింగ్ కాంస్యం సొంతం చేసుకున్నాడు. భారత్ 14 పతకాలతో టోర్నీని ముగించింది.