Shooting | లిమా (పెరూ): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో యువ షూటర్లు పతకాల పంట పండించడంతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీ ఆఖరి రోజైన సోమవారం.. పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో దీపక్ దలాల్, కమల్జీత్, రాజ్ చంద్రతో కూడిన భారత త్రయం స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఈ ముగ్గురూ 1,616 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచారు.
మహిళల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో పరిషా గుప్తా రజతం దక్కించుకోగా టీమ్ ఈవెంట్లో సెజల్ కాంబ్లీ, కేతన్, కనిష్క దాగర్ సైతం రజతం నెగ్గింది. మిక్స్డ్ టీమ్ ట్రాప్ కాంపిటీషన్లో శార్దూల్, సబీర కాంస్యం సాధించారు. ఈ టోర్నీలో భారత్ 13 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తంగా 24 పతకాలు నెగ్గింది. ఇటలీ (13), నార్వే (10) తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రా కుర్రాడు ముకేశ్ నెలవెల్లి పలు ఈవెంట్లలో పాల్గొని ఏకంగా 8 పతకాలు సాధించడం విశేషం.