Ishant Sharma : భారత పేసర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తండ్రి కాబోతున్నట్టు వెల్లడించాడు. ఇషాంత్ భార్య ప్రతిమ(Pratima) మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ మధ్యే ప్రతిమ శ్రీమంతం(Baby Shower) వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇషాంత్ ‘డాడ్ టు బీ’, ప్రతిమ ‘మామ్ టు బీ’ ప్లకార్డు ధరించి.. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి అందరూ చప్పట్లు కొడుతూ చుట్టూ తిరిగారు.
ఈ విషయాన్ని ఇషాంత్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. దాంతో, వీళ్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్(IPL)లో ఇషాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) యాజమాన్యం కూడా కంగ్రాట్స్ తెలిపింది. ‘మన ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలోకి త్వరలోనే కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఇషాంత్, ప్రతిమ.. మీ ఇద్దరికీ కంగ్రాట్స్’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇషాంత్, బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన ప్రతిమ 2016లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ మూచ్చువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రతిమను తొలిసారి చూడగానే ప్రేమలో పడిపోయానని ఇషాంతో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ప్రతిమను తొలి చూపులోనే ప్రేమించా. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఆ క్షణమే అనుకున్నా’ అని తెలిపాడు.
ఇషాంత్ శర్మ
సహచరులు, అభిమానులు ముద్దుగా లంబూ అని పిలిచే ఇషాంత్ వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో కామెంటేటర్(Commentator)గా కొత్త అవతారం ఎత్తాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఈ వెటరన్ పేసర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొట్టాడు. వయసు పైబడిన తన బౌలింగ్ పస తగ్గలేదని నిరూపించాడు.