Mitchell Starc | మనసు మార్చుకున్న ఆసీస్ స్టార్.. తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లో రీ-ఎంట్రీ..!
Mitchell Starc : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) మనసు మార్చుకున్నాడు. ఫ్రాంచైజ్ క్రికెట్ కంటే జాతీయ జట్టు(National Team)కే తొలి ప్రాధాన్యం అని చెప్పిన అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. 9 ఏళ్ల క్రితం ఈ లీగ్ నుంచి తనంతట తానుగా తప్పుకున్న స్టార్క్ పునరాగనం కోసం...
Mitchell Starc : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) మనసు మార్చుకున్నాడు. ఫ్రాంచైజ్ క్రికెట్ కంటే జాతీయ జట్టు(National Team)కే తొలి ప్రాధాన్యం అని చెప్పిన అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. 9 ఏళ్ల క్రితం ఈ లీగ్ నుంచి తనంతట తానుగా తప్పుకున్న స్టార్క్ పునరాగనం కోసం తహతహలాడుతున్నాడు. ఈ కంగారు స్పీడ్‌స్టర్ వచ్చే ఏడాది 2024 ఐపీఎల్ వేలంలో పేరు రిజిష్టర్ చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
‘నేను కచ్చితంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాను’ అని స్టార్క్ ఆసీస్‌కు చెందిన విల్లో టాక్(Willow Talk) క్రికెట్ పోడ్కాస్ట్లో తెలిపాడు. అయితే.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్( T20 World Cup) ఉన్నందున స్టార్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్లో అతను చివరిసారిగా 2015 సీజన్లో కనిపించాడు. ఈ యార్కర్ కింగ్ 2014, 15లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Rroyal Challengers Bangalore) తరఫున ఆడాడు.
ఆర్సీబీ జెర్సీతో మిచెల్ స్టార్క్

ఎడమ చేతివాటం పేసర్ అయిన స్టార్క్ ఐపీఎల్లో ఆడింది రెండు సీజన్లే. అయినా ఈ స్పీడ్‌స్టర్ తన సూపర్ స్పెల్స్‌తో బ్యాటర్లను వణికించాడు. అయితే.. కుటుంబంతో సమయం గడపడం కోసం, అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటడం కోసం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ 2018లో స్టార్క్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. అప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఫ్రాంఛైజీ అతడిని రూ. 9.40 కోట్లకు కొన్నది. కానీ, గాయం కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు.

ఆ తర్వాత ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI World Cup) కారణంగా స్టార్క్ ఐపీఎల్ ఆడలేదు. 2020లోనైనా అందుబాటులో ఉంటాడు అనుకుంటే బిజీ షెడ్యూల్ కారణంగా అదీ సాధ్యం కాలేదు. ఆలోపే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship) రేసు మొదలైంది. దాంతో, స్టార్క్ పూర్తిగా జాతీయ జట్టుకు ఆడడంపైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్క్ఈసారి వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగాలని అనుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
ICC Player oF The Month | ఆగస్టు నెల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు.. రేసులో మలేషియా ఆల్‌రౌండర్
ODI World Cup 2023 | నెదర్లాండ్స్ వరల్డ్ కప్ బృందం ఇదే.. 15 మందిలో మన తెలుగు బిడ్డ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

