IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్‌పై రెండొందల పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ ఈసారి 200 కొట్టేసింది. అయితే.. ఓపెనర్లు మాత్రం అర్ధ శతకాలతో విరుచుకుపడలేదు. డేంజరస్ క్లాసెన్ కూడా పెద్ద స్కోర్ చేయలేదు. ప్రధాన బ్యాటర్లు విఫలమైన లక్నో గడ్డపై హిట్టర్ ఇషాన్ కిషన్(94 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ తర్వాత 10 వ మ్యాచ్‌లో అర్ధ శతకంతో కదం తొక్కిన ఈ లెఫ్ట్ హ్య్యాండర్ హెన్రిచ్ క్లాసెన్(28), అనికేత్ వర్మ(26)లతో కీలక భాగస్వామ్యాలు నెకొల్పాడు. ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(13 నాటౌట్)తో కలిసి జట్టు స్కోర్ 200 దాటించాడు. దయాల్ వేసిన 20వ ఓవర్లో ఇషాన్ వరుసగా 4, సిక్సర్ బాదడంతో సన్‌రైజర్స్ జట్టు ఆర్సీబీకి 232 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న ట్రావిస్ హెడ్ (17) యశ్ దయాల్ వేసిన తొలి ఓవర్లో బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌కు చుక్కలు చూపిస్తూ అభిషేక్ శర్మ(34) తనదైన స్టయిల్లో విధ్వంసం కొనసాగించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 రన్స్ సాధించాడు. అతడు బలంగా కొట్టిన బంతి స్టాండ్స్‌లోని టాటా కర్వ్ కారు అద్ధానికి తాకడంతో.. అద్దం బద్ధలైంది. అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో అభిషేక్ కళ్లు చెదిరే సిక్సర్ బాదడంతో 3.3 ఓవర్లకే స్కోర్ 50 దాటింది. ఆ తర్వాత ఫోర్ బాదిన అభిషేక్ టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. లెగ్ సైడ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అభి.. ఫిల్ సాల్ట్ చేతికి చిక్కాడు. దాంతో, 54 వద్ద ఆరెంజ్ ఆర్మీ తొలి వికెట్ పడింది. కాసేపటికే డేంజరస్ హెడ్‌ను భువనేశ్వర్ ఔట్ చేసి సన్‌రైజర్స్‌ను ఒత్తిలోకి నెట్టాడు.
Let’s keep the momentum going! ⚡💪#PlayWithFire | #RCBvSRH | #TATAIPL2025 pic.twitter.com/gmAhEXLD6F
— SunRisers Hyderabad (@SunRisers) May 23, 2025
ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యాక హెన్రిచ్ క్లాసెన్(28).. ఇషాన్ కిషన్(94 నాటౌట్: 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) జోడీ కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆర్సీబీ స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్వయం.. పవర్ ప్లేలో స్కోర్ 70 దాటించింది. క్లాసెన్ వెనుదిరిగాక.. అనికేత్ వర్మ(26)తో కలిసి 17 బంతుల్లోనే 43 రన్స్ రాబట్టాడు. ఆ తర్వా నితీశ్ కుమార్ రెడ్డి(4) విఫలం కాగా.. అభిమన్యు మనోహర్(12) కాసేపు అలరించాడు. అయితే.. షెపర్డ్ అతడిని పెవిలియన్ చేర్చగా 188వ వద్ద హైదరాబాద్ ఆరో వికెట్ పడింది.
The duo brought the carnage 🔥
Aniket Verma & Ishan Kishan’s 17-ball 43-run partnership was fun while it lasted 🧡
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @SunRisers | @ishankishan51 pic.twitter.com/i4S4Mt1OKC
— IndianPremierLeague (@IPL) May 23, 2025
ఓవైపు వికెట్లు పడుతున్నా జోరు తగ్గించని ఇషాన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ఒంటిచేత్తో బాదిన సిక్సర్ అతడి ఇన్నింగ్స్‌లోనే హైలైట్. ఆ సిక్సర్‌తో ఆరెంజ్ ఆర్మీ స్కోర్ 200 దాటింది. ఎంగిడి వేసిన 19వ ఓవర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(13 నాటౌట్) డీప్ లెగ్ స్క్వేర్ దిశగా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దయాల్ వేసిన 20వ ఓవర్లో కిందపడిపోతూ ఆఫ్ సైడ్‌లో బౌండరీ బాదిన ఈ చిచ్చరపిడుగు.. ఆ తర్వాత బంతిని సిక్సర్‌గా మలిచాడు. దాంతో, సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.