Ishan Kishan : ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఆసియా కప్ (Asia Cup 2025) ముందే గాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్న్లో అదరగొట్టి.. పునరాగమనం చేస్తాడనుకుంటే.. దులీఫ్ ట్రోఫీ (Duleep Trophy) నుంచి అనూహ్యంగా దూరమయ్యాడు. ఈస్ట్ జోన్ సారథిగా ఎంపికైన ఈ చిచ్చరపిడుగు మెగా టోర్నీలో ఆడడం లేదని ధ్రువీకరించిన ఒడిశా క్రికెట్ సంఘం అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకుంది. ఇషాన్ బదులు 27 ఏళ్ల ఆశీర్వాద్ స్వెయిన్ను స్క్వాడ్‌లోకి రాగా.. వైస్ కెప్టెన్‌గా ఉన్న అభిమన్యు ఈశ్వరన్ జట్టును నడిపిస్తాడని ఈస్త్ జోన్ సెలెక్టర్లు తెలిపారు.
‘ఇషాన్ కిషన్ గాయంతో దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో ఒడిశా వికెట్ కీపర్, బ్యాటర్ ఆశీర్వాద్ స్వెయిన్ ఈస్ట్ జోన్ స్క్వాడ్‌లోకి తీసుకున్నాం. సందీప్ పట్నాయక్‌కు అతడు బ్యాకప్‌గా ఉంటాడు. యువకెరటం స్వస్తిక్ సమాల్‌ను స్టాండ్ బైగా ఎంపిక చేశాం’ అని ఒడిశా క్రికెట్ సంఘం సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. దులీప్ ట్రోఫీలో ఆగస్టు 28న నార్త్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది.
Odisha’s wicketkeeper-batter Aashirwad Swain has been selected for the East Zone squad in the Duleep Trophy, replacing Ishan Kishan! 🏏🔥
He joins Sandeep Pattnaik in the squad, while Swastik Samal has been named as standby. 👏✨#odishacricketassociation #duleeptrophy #eastzone… pic.twitter.com/tgffJry9PU— Odisha Cricket Association (@cricket_odisha) August 17, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో సెంచరీతో మెరిసిన ఇషాన్ జాతీయ జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ మాంచెస్టర్ టెస్టులో పంత్ గాయపడిన తర్వాత అతడికి పిలుపు వస్తుందని ఊహించారంతా. కానీ, ఇషాన్ మాత్రం అయిష్టం చూపించడంతో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
ఈస్ట్ జోన్ స్క్వాడ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, దినేశ్ దాస్, శ్రీదామ్ పాల్, శరన్‌దీప్ సింగ్, కుమార్ కుషగ్ర, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముకేశ్ కుమార్, మహ్మద్ షమీ, ఆశీర్వాద్ స్వెయిన్.
స్టాండ్ బై ప్లేయర్లు : ముఖ్తర్ హుస్సేన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్, రాహుల్ సింగ్.