Asia Cup | సెంచరీ దిశగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషాన్.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆసియా కప్ లో పాకిస్థాన్ తో ఆడుతున్న టీం ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. 38 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఔటయ్యే సమయానికి ఇషాన్ కిషాన్ 82 పరుగులు చేశాడు. ఇషాన్ కిషాన్ స్థానంలో రవీంద్ర జడేజా (0), హార్దిక్ పాండ్యా 66 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు ఇసాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడుతూ టీం ఇండియా స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. నవాజ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతిని ఇషాన్ కిషాన్ ఫోర్ కొడితే, మూడో బంతిని హార్దిక్ పెవిలియన్ (6) బాట పట్టించాడు. దీంతో భారత్ స్కోర్ 200 మార్క్ దాటింది.