IPL 2025 : సన్‌రైజర్స్ హిట్టర్ ఇషాన్ కిషన్(56) అర్ధ శతకంతో మెరిశాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతున్న ఇషాన్ మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి.. ఫీఫ్టీ పూర్తి చేసుకున్నాడీ వికెట్ కీపర్. రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ తర్వాత పది ఇన్నింగ్స్‌ల్లో అతడికిదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
అయితే.. సహచరులు మాత్రం వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు.హెన్రిచ్ క్లాసెన్(28), అనికేత్ వర్మ(26), నితీశ్ కుమార్ రెడ్డి(4)లు వరుసగా ఔటయ్యారు. ప్రస్తుతం అభిమన్యు మనోహర్(1) జతగా మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు ఇషాన్. దాంతో, లక్నో సూపర్ జెయింట్స్‌పై రెండొందల పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ 200 కొట్టే దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లకు స్కోర్.. 168-5.
Stylish and powerful 👏
Ishan Kishan brings up a 28-ball 5⃣0⃣ and is leading #SRH‘s charge 💪
Will he score his second 1⃣0⃣0⃣ of the season?
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @SunRisers | @ishankishan51 pic.twitter.com/TM65DgH7gn
— IndianPremierLeague (@IPL) May 23, 2025