న్యూఢిల్లీ : భారత స్టార్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ మరోసారి ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పోటీ పడనుంది. సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరిగే ఈ మెగా క్రీడల కోసం మొత్తం 30 మందితో కూడిన భారత షూటింగ్ జట్టును ఎన్ఆర్ఏఐ గురువారం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇషా సింగ్, వెటరన్ షూటర్ కైనన్ చెనాయ్ చోటు దక్కించుకున్నాడు.
ఇటీవల మ్యూనిచ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకంతో పాటు ప్రపంచ రికార్డు సృష్టించిన ఇషా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆసియా గేమ్స్‌లో తను మను భాకర్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ రెండో విభాగాల్లోనూ పోటీ పడనుంది. కైనన్ చెనాయ్ ట్రాప్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.