Shoaib Malik | పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) మాజీ భర్త షోయబ్ మాలిక్ (Shoaib Malik) ముచ్చటగా మూడోసారి విడాకులకు (divorce) సిద్ధమైనట్లు తెలుస్తోంది. సానియాకు విడాకులు ఇచ్చిన అనంతరం షోయబ్ పాక్‌కు చెందిన నటి సనా జావెద్ (Sana Javed)ను గతేడాది మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన ఏడాదికే సనాతో తన వివాహ బంధానికి స్వస్తి పలికేందుకు షోయబ్ సిద్ధమైనట్లు తెగ ప్రచారం జరుగుతోంది.
షోయబ్ మాలిక్ తొలుత హైదరాబాద్‌కు చెందిన అయేషా సిద్దిఖీ (Ayesha Siddiqui)ని 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే.. 2010లో ఆమెతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియా మీర్జాను మనువాడాడు. 2010లో షోయబ్ మాలిక్, సానియా మిర్జాల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్లో వలీమా వేడుక జరిగింది. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు. అయితే.. షోయబ్ ప్రేమవ్యవహారాలతో విసిగిపోయిన సానియా అతడికి విడాకులు ఇచ్చేసింది. ‘షరియా చట్టం’లోని ‘ఖులా’(Khula) పద్ధతిలో తన కూతురు షోయబ్‌కు డివోస్ ఇచ్చిందన సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా అప్పట్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
సానియాతో విడాకుల అనంతరం షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి పెండ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. పాకిస్థాన్ ప్రముఖ సినీతారగా గుర్తింపు పొందిన సనా జావెద్‌ను గతేడాది జనవరి 22న వివాహం చేసుకున్నాడు. మాలిక్‌కు ఇది మూడో వివాహం కాగా, సనాకు రెండోది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విడాకులకు (Third divorce) సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది.
Also Read..
Nitish Kumar Reddy: ఫ్లయింగ్ క్యాచ్ పట్టిన నితీశ్ రెడ్డి.. వీడియో
India Vs West Indies: డిక్లేర్తో ట్విస్ట్ ఇచ్చిన ఇండియా.. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న విండీస్
Marufa Akter | వరల్డ్ కప్‌లో ‘బెస్ట్ బాల్’.. బంగ్లా పేసర్‌కు యార్కర్ కింగ్ ప్రశంసలు..!