న్యూఢిల్లీ: రేసింగ్ ప్రియులను అలరించేందుకు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్య్యూట్ మళ్లీ సిద్ధమైంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్(ఐఆర్ఎఫ్)లో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్), ఫార్ములా-4 ఇండియన్ చాంపియన్‌షిప్(ఎఫ్4ఐసీ) మూడో రౌండ్ పోటీలు జరుగనున్నాయి. గత వారం చెన్నైలో నైట్ స్ట్రీట్ సర్యూట్ రేసును విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో మూడో రౌండ్లో ఆరు జట్లకు చెందిన రేసర్లు అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 3.7కి.మీ కల్గి ఉన్న మద్రాస్ ఇంటర్నేషనల్ సర్యూట్‌లో ఇప్పటికే జరిగిన రెండు రౌండ్లలో జాన్ లాంకస్టర్, అలిస్టర్ యంగ్ విజేతలుగా నిలువగా, మూడో రౌండ్లో తీవ్ర పోటీ నెలకొన్నది. దీనికి తోడు ఫార్ములా-4లో యువ రేసర్లు సత్తాచాటాడం సంతోషంగా ఉందని ఆర్పీపీఎల్ ఎండీ అఖిలేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ లీగ్ ద్వారా దేశంలో రేసింగ్‌ను ఆదరించే అభిమానుల సంఖ్య మరింత పెరిగిందని అన్నారు.